తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు హామీలను అమలు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాజాగా, రెండు హామీలను ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలకు ఏమాత్రం మింగుడుపడడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ALSO READ: గుడ్ న్యూస్.. ఈ నెల 11 నుంచే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు

నిరుపేదలకు ఇళ్లు

ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఖర్చుతో స్థలం ఉన్నా లేకపోయిన నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. దాదాపు పదేళ్ల తర్వాత నిరుపేదల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నామని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాలకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్.. కేసీఆర్ పేరుతో అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button