తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభించనున్నారు.

Also read: Mudragada: వైసిపిలోకి ముద్రగడ.. బహిరంగ లేఖ విడుదల

ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 500 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి 22 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి రానున్నాయి. మెట్రో ఎలక్ట్రిక్ బస్సులోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. మోడ్రన్ లుక్, కంఫర్టబుల్ సీటింగ్ తో తొలిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను తీసుకొచ్చింది ఆర్టీసీ. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో సాధారణ ఛార్జీలే ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button