తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూన్ 03

ప్రపంచ సైకిల్ దినోత్సవం:

ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. 2018 లో తొలిసారిగా ఈ రోజును జరుపుకున్నారు.

కరుణానిధి పుట్టినరోజు:

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎం.కే కరుణానిధి 1924 తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారు. ఎంకే డా. కళైజ్ఞర్ గా ప్రసిద్ధి చెందారు. తమిళనాడుకు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు.

జార్జ్ ఫెర్నాండెజ్ పుట్టినరోజు:

కేంద్ర మాజీ మంత్రి, రాజనీతిజ్ఞుడు, పాత్రికేయుడు జార్జ్ మాథ్యూ జార్జ్ ఫెర్నాండెజ్ 1930 మంగళూరులో జన్మించారు. పరిశ్రమలు, రక్షణ, రైల్వే, సమాచార శాఖలలో తన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేశారు.

రాధ పుట్టినరోజు:

భారతీయ ప్రముఖ నటి రాధ 1966 తిరువనంతపురంలో జన్మించారు. ఈమె అసలు పేరు ఉదయ చంద్రిక. 80వ దశకంలో నాయకిగా రాణించి దక్షిణాది భాషలలో 250కి పైగా సినిమాల్లో నటించారు.

విలియం హార్వే మరణం:

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త విలియం హార్వే 1657 రోహాప్టన్ లో మరణించారు. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా ఏళ్ల క్రితమే వివరించి నేటి వైద్యలకు మార్గదర్శకులయ్యారు.

మహమ్మద్ అలీ మరణం:

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ అలీ 2016 అమెరికాలోని ఆరిజోనా ఫీనిక్స్ లో కన్నుమూశారు. హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా మూడుసార్లు నిలిచారు. ఈయన అసలు పేరు క్లాషియస్ క్లే.

మరిన్ని విశేషాలు:

 • బిట్రిష్ వైస్రాయి మౌంట్ బాటన్ 1947లో స్వదేశీ సంస్థానాలపై ప్రకటన చేశారు. స్వాతంత్య్రానంతరం దేశంలో వారి సార్వభౌమత్యం తొలగించబడుతుందని ప్రకటించారు.
 • అమృత్ సర్ సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణదేవాలయంలో 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైంది. ఇది జూన్ 6 వరకు కొనసాగింది.
 • స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్‌సభ సభ్యురాలు సంగం లక్ష్మీబాయి 1979 లో కన్నుమూశారు. ఈమె ఆంధ్రప్రదేశ్ నుండి లోక్‌సభ సభ్యురాలైన తొలి మహిళగా చరిత్రకెక్కారు.
 • తెలంగాణ రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు 1972 సిద్దిపేట జిల్లా చింతమడకలో జన్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో గెలుపొంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా దేశంలోనే చరిత్ర సృష్టించారు.

One Comment

 1. смерть таро черный гримуар значение как
  гадать на детей по кольцу, гадание на количество детей онлайн сон веревка с узлами, к
  чему снится веревка канат
  благословение на работу молитвы святых колтуны в
  волосах примета

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button