తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Allu Arjun: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్!

ఇవాళ ఉదయం అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై వాడీవేడీ చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్‌ను థియేటర్‌కు రావొద్దని పోలీసులు చెప్పినా వినకుండా రోడ్ షో చేసుకుంటూ వచ్చారని అన్నారు. బాధిత కుటుంబాన్ని కనీసం ఏ ఒక్క సినీ ప్రముఖుడూ పరామర్శించలేదని మండిపడ్డారు. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సైతం అల్లు అర్జున్ క్యారెక్టర్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు.

ఎవరితోనూ వివాదం కోరుకోవడం లేదు!

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. కొంతమంది తన క్యారెక్టర్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారని అన్నారు. తొక్కిసలాట ఘటన జరగడం నిజంగా బాధాకరమని, అది అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమేనని, అందులో ఎవరి తప్పు లేదని అన్నారు. అంతేకాదు, పర్మిషన్ ఉన్నందుకే తాను థియేటర్ వద్దకు వెళ్లానని అన్నారు. తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ తప్పని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన క్యారెక్టర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని, మహిళ చనిపోయిందని తనకు ఉదయం తెలిసిందన్నారు. విషయం తెలియగానే ఆసుపత్రికి వెళ్దామంటే కేసు నమోదు అయినందున వెళ్లాలేకపోయానని చెప్పారు. ఇవన్నీ తాను ఎవరిపైనా చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు కావాని, ప్రభుత్వంతో గానీ, ఎవరితోనూ తాను వివాదం కోరుకోవడం లేదని స్పష్టంచేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button