తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

బాలల అంతర్జాతీయ పుస్తక దినోత్సవం

ఎటువంటి లాభాపేక్షలేని సంస్థ అయిన ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ (IBBY) స్పాన్సర్ చేస్తున్న వార్షిక కార్యక్రమమే బాలల అంతర్జాతీయ పుస్తక దినోత్సవం. 1967లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏటా ఏప్రిల్ 2న ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇందులో భాగంగా వ్యాస రచన పోటీలు, పుస్తక అవార్డుల ప్రకటనలు నిర్వహిస్తున్నారు. పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డే

ప్రపంచవ్యాప్తంగా ఆటిస్టిక్ (మందబుద్ధి గల) వ్యక్తుల గురించి సమాజంలో అవగాహన పెంచడానికి ఏటా ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డేను నిర్వహిస్తున్నారు. నవంబర్ 1, 2007న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం (A/RES/62/139)
వరల్డ్ ఆటిజం డేను ఆమోదించింది. అప్పటి నుంచి ఈరోజును ప్రపంచ దేశాలన్నీ ఏటా పాటిస్తున్నాయి.

అజయ్ దేవగన్ పుట్టినరోజు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ 1969లో జన్మించారు. బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే నటనతో మెప్పించి ఫిలింఫేర్‌ పురస్కారం అందుకున్నారు. రెండో చిత్రం ‘జిగర్‌’లో తన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రావీణ్యం చూపించి యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్నారు. ‘ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌‌’లో భగత్‌ సింగ్‌ పాత్రకు ప్రాణం పోసి జాతీయ పురస్కారం సాధించారు. 2016లో భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

వశిష్ఠ నారాయణ సింగ్ జననం

బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ట నారాయణ్ సింగ్ 1942లో భోజ్‌పూర్‌లో జన్మించారు. ఆర్యభట్ట గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సమస్యలను సాధించిన మహా మేధావి ఈయన. వశిష్ట నారాయణ్‌కు చిన్ననాటి నుంచే గణితం పట్ల ఆసక్తి ఎక్కువ. బాల్యంలో వసిష్ట నారాయణ సింగ్ ప్రాథమిక విద్యను స్వంత గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన నెహర్తాట్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరాడు. 1962లో ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షలో బిహార్‌లో మొదటి స్థానంలో నిలిచారు.

శామ్యూల్ ఫిన్లీ మరణం

ప్రముఖ అమెరికన్ చిత్రకారుడు, ఆవిష్కర్త శామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్.. 1791 ఏప్రిల్ 27న జన్మించారు. యూరోపియన్ టెలిగ్రాఫ్‌ల ఆధారంగా సింగిల్-వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థను కనిపెట్టారు. కాలక్రమేణా, అతను అభివృద్ధి చేసిన మోర్స్ కోడ్ ప్రపంచంలో టెలిగ్రాఫీ ప్రాధమిక భాష అయింది. సమాచారం లయబద్ధమైన ప్రసారానికి ఇది ఇప్పటికీ ప్రమాణంగా ఉంది. 1872వ సంవత్సరం ఏప్రిల్ 2న తుదిశ్వాస విడిచారు.

మరికొన్ని విశేషాలు:

  • 2011లో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
  • 1933 : ప్రముఖ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్‌ సింహ్‌జీ మరణించారు. ఈయన పేరిటే భారత్‌‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.
  • 1915: తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జన్మించారు.
  • 1981: ఆస్ట్రేలియా క్రికెటర్ మఖేల్ క్లార్క్ జన్మించారు.
  • 1972 : చార్లీ చాప్లిన్ అమెరికాకు తిరిగి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button