తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఆగస్ట్ 1: చరిత్రలో ఈరోజు

ప్రపంచ తల్లిపాల వారోత్సవం

ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి వారం (1 నుంచి 7 వరకు)లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తారు. తల్లిపాల వల్ల పిల్లల్లో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అందరికీ అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

వరల్డ్ వైడ్ వెబ్ డే

యావత్ ప్రపంచాన్ని మన వేలి కొనలపై ఉంచిన ఘనత వరల్డ్ వైడ్ వెబ్ (www)ది. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1న వరల్డ్ వైడ్ వెబ్ డేని జరుపుకుంటారు. దీని ఆవిష్కర్త టిమ్ బెర్నర్స్-లీ అదే రోజున వరల్డ్ వైడ్ వెబ్ ప్రతిపాదన చేశారు.

ఆక్సిజన్

ఈ సృష్టిలోని ప్రతి జీవికి జీవనాధరమైన ఆక్సిజన్ మూలకాన్ని 1774 ఆగస్ట్ 1న జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అమెరికాలో జనాభా లెక్కలు

1790 ఆగస్ట్ 1న అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిశాయి. ఆనాటి అమెరికా జనాభా 39,29,214 మాత్రమే. కానీ ప్రస్తుతం అమెరికా జనాభా 34 కోట్లకు పైగా.

ఎమ్ టీవీ

అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎమ్ టీవీ 1981 ఆగస్ట్ 1న అర్ధరాత్రి 12:01 నిమిషాలకు తన మొదటి ప్రసారాన్ని ప్రారంభించింది.

హీరోయిన్ మృణాల్ ఠాగూర్

ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ 1992 ఆగస్ట్ 1న మహారాష్ట్రలో జన్మించారు. 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో తన మొదటి సినిమా ‘సీతారామం’తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

హీరోయిన్ తాప్సీ

బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పను ఆగస్ట్ 1, 1987న ఢిల్లీలో జన్మించారు. తెలుగులో 2010లో విడుదలైన ‘ఝుమ్మందినాదం’ ఆమె మొదటి చిత్రం. హిందీ, తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషా చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button