ఆగస్ట్ 2: చరిత్రలో ఈరోజు
బిల్లు ఆమోదం
ఆగస్ట్ 2, 1858న ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి భారతదేశ పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు పార్లమెంటు బిల్లు ఆమోదం పొందింది.
భూగర్భ రైల్వే లైన్
లండన్‌లోని థేమ్స్ నదికి దిగువన ఉన్న టవర్ సబ్‌వే నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన భూగర్భ రైల్వే లైన్ ప్రారంభమైంది.
పింగళి వెంకయ్య జననం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 1876 ఆగస్ట్ 2న ఏపీలో జన్మించారు. పింగలి వెంకయ్య భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందేమాతరం, హోం రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు.
దేవీ శ్రీప్రసాద్ బర్త్ డే
టాలీవుడ్ రాక్ స్టార్, డీఎస్‌పీగా పేర్గాంచిన దేవీ శ్రీప్రసాద్ 1979 ఆగస్ట్ 2న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. జాతీయ అవార్డుతో పాటు ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, సైమా అవార్డులు గెలుచుకున్నారు.
అలెగ్జాండర్ గ్రాహంబెల్ మరణం
అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, టెలీఫోను ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఆగస్ట్ 2, 1922న కెనడాలో మరణించారు.