తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Ayodhya: అయోధ్య రామయ్య భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి 24 గంటలు దర్శనం

అయోధ్యకు రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రస్టు అధికారులు ముందస్తు దర్శన సమయాన్ని పెంచారు. ఏప్రిల్​ 17 నుంచి మూడు రోజుల పాటు 24 గంటలు దర్శనం కల్పించనున్నారు. అయోధ్య రామమందిరంలో మరో ఉత్సవం జరగనుంది. అయోధ్యలో కొత్త ఆలయాన్ని నిర్మించిన తర్వాత.. మొదటిసారిగా శ్రీరాముని పుట్టినరోజు జరుపుకునే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 17 నుంచి 3 రోజులపాటు ఉత్సవాలు జరపాలని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరిగిన తరువాత తొలి కార్యక్రమం కావడంతో భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్న ట్రస్ట్.. అందుకు తగ్గట్లు అయోధ్యలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది.

Also read: General Elections: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

శ్రీరామనవమికి అధిక సంఖ్యలో అయోధ్యకు భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారందరికి బాలరాముడి దర్శనాలు కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కొన్ని సమయాల్లో మాత్రం కొద్దిసేపు మాత్రమే ఆలయ తలుపులు మూసివేయాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అయోధ్య బాలరాముడికి నైవేద్యం సమర్పించేటప్పుడు.. అలంకారం చేసేటప్పుడు మాత్రమే భక్తులకు దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అయోధ్య రామాలయం తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంచుతున్నారు. ఈ సమయాల్లోనే భక్తులకు బాలరాముడు దర్శనం ఇస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button