Bumrha: మరో మైలురాయి.. 400 వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన బుమ్రా!
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌ల్లో 400 వికెట్లు పూర్తి చేసిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చేరారు. చెన్నై వేదికగా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో హసన్ మహ్మద్ వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్న బుమ్రా.. తన వికెట్ల సంఖ్యను 401కు పెంచుకున్నాడు.
ఇక, ఈ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌ను తీసుకున్న బుమ్రా.. రహీం, తస్కిన్ అహ్మద్, హసన్ మహమ్మద్ వికెట్లనూ పడగొట్టారు. 2016 లో తొలిసారి బుమ్రా ఆస్ట్రేలియాపై వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. 2016 లోనే తొలిసారి టీ20 ఆడగా.. 2018లో తొలిసారిగా టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు 89 వన్డేల్లో 149 వికెట్లు.. 70 టీ20 మ్యాచ్ ల్లో 89 వికెట్లు.. 39 టెస్ట్ మ్యాచ్ ల్లో 159 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు
- అనిల్ కుంబ్లే – 953 వికెట్లు
- ఆర్.అశ్విన్ – 744 వికెట్లు
- హర్భజన్‌సింగ్ – 707 వికెట్లు
- కపిల్‌దేవ్ – 687 వికెట్లు
- జహీర్‌ఖాన్- 597 వికెట్లు
- రవీంద్ర జడేజా – 570 వికెట్లు
- జవగళ్ శ్రీనాథ్ – 551 వికెట్లు
- మహ్మద్ షమీ – 448 వికెట్లు
- ఇషాంత్ శర్మ – 434 వికెట్లు
- జస్పీత్ బూమ్రా – 400* వికెట్లు