తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో ప్రజల పరుగులు

ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. జావా ద్వీపం సమీపంలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. రాజధాని జకార్తాలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప తీవ్రతకు భవనాలు కూలిపోయాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Also read: India: భారత్ కు చెత్త ర్యాంక్.. అత్యంత కాలుష్య పూరిత దేశాల్లో 3వ స్థానం

జావా ద్వీపం ఉత్తర తీరంలో బవెన్ ద్వీపానికి సమీపంలో భూమి లోపల 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇండోనేషియా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:52 గంటలకు భూకంపం సంభవించింది.

ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. కాగా 2021 జనవరిలో సులవేసి ద్వీపాన్ని భూకంపం కుదిపేసింది. సుమారు 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 2018 లో సులవేసిలోని పాలూలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంతో .. సునామీ కారణంగా 2,200 మందికి పైగా మరణించారు. 2004లో అదే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం, సునామీకి ఇండోనేషియాలో 1.70 లక్షల మందికి పైగా మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button