ప్రత్యేక కథనం
Free Gas Scheme: ఏపీలో ‘ఉచిత గ్యాస్ సిలిండర్’ పథకం ప్రారంభం!
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
కేవైసీ తప్పనిసరి!
ఇక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై అపోహలను నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అలాగే రాష్ట్రంలోని అర్హులైన అందరూ.. తప్పకుండా కేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ పథకంలో భాగంగా ఒక్కరోజులోనే 4.5 లక్షల బుకింగ్స్ వచ్చినట్లు తెలిపారు. అలాగే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చే ఈ పధకానికి ఐదేళ్లకు రూ.13 వేల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.