తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Google Maps: ‘గూగుల్ మ్యాప్స్’లో మరో కొత్త ఫీచర్.. ఇకపై జర్నీ మరింత సులభం

మన ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేసిన అద్భుతమైన అప్లికేషన్ ‘గూగుల్ మ్యాప్స్’. గూగుల్ సంస్థ రూపొందించిన ఈ అప్లికేషన్‌తో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీని పుణ్యమా అని ఈ భూ ప్రపంచంలో ఎక్కడినా వేగంగా, సులభంగా మనం చేరుకోగలుగుతున్నాం. ఫోన్ ఓపెన్ చేసి ‘గూగుల్‌ మ్యాప్స్‌’ పెట్టుకుంటే చాలు ఎంచక్కా ఎక్కడికంటే అక్కడికి రయ్… అంటూ వెళ్లిపోతున్నాం. ముఖ్యంగా ట్రావెలర్స్‌కి, ప్రొడక్ట్ డెలివరీ సంస్థలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు దీనిపై ఆధారపడి పనిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

ALSO READ: భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు

గూగుల్‌ మ్యాప్స్‌లో ఇప్పటికే ఎన్నో ఫీచర్లు వచ్చాయి. రియల్ టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌, ఫ్యూయెల్​ సేవింగ్, ట్రాఫిక్ అవైడెడ్ రూట్ వంటి ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. లాక్‌ స్క్రీన్‌పైనే లొకేషన్‌ కనిపించేలా ఈ ఫీచర్‌ను డెవలప్ చేశారు. ఈ ఫీచర్‌తో మొబైల్‌ లాక్‌ స్క్రీన్‌పై ఈటీఏ (ఎస్టిమేటెడ్‌ టైమ్‌ ఆఫ్‌ అరైవల్‌), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్‌ ప్రత్యక్షమవుతాయి. అంటే ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఏదైనా లొకేషన్‌కు సంబంధించిన వివరాలు ఎంటర్‌ చేయగానే.. స్టార్ట్‌ బటన్‌ క్లిక్‌ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే రూట్‌లో ప్రయాణిస్తుంటే.. ఆటోమేటిక్‌గా రూట్‌ అప్‌డేట్‌ అవుతుంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button