తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్ప్రత్యేక కథనం

Jai Hanuman: ‘జై హనుమాన్’ రిలీజ్ డేట్‌పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘హనుమాన్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత అదే బ్యానర్ మీద ‘డార్లింగ్’ అనే సినిమా తెరకెక్కింది. హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ప్రియదర్శి హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. మూవీ యూనిట్ ఇవాళ నిర్మాతలతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు అదే బ్యానర్లో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు.

ALSO READ: ముఖం చాటేస్తున్న వానలు.. ఖరీఫ్ సాగుకు నీటి కటకటేనా?

నిజానికి హనుమాన్ సినిమా చివర్లో ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం చైతన్య రెడ్డి ఆ సినిమాకు కనీసం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. ఎందుకంటే ‘జై హనుమాన్’ సినిమాలో ‘హనుమాన్’ ఫ్రాంచైజ్‌లో ఉన్న అందరు హీరోలను తీసుకురావాలని అనుకుంటున్నారని, దానికి తగ్గట్టు స్క్రిప్ట్‌లో కూడా మార్పులు చేర్పులు చేశారని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, సంక్రాంతికి రావడమైతే అసాధ్యమే అని అన్నారు. ‘హనుమాన్’ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము అనుకోలేదు, ఇప్పుడు ఆ సక్సెస్‌ని గౌరవిస్తూ రెండో భాగాన్ని అంతకుమించి ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చేదిద్దుతున్నామని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button