తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Jio: జియో యూజర్లకు షాక్.. డాటా వాలిడిటీలో మరోసారి మార్పులు!

రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లపై డేటా ప్లాన్ భారం మోపింది. జియోలో అత్యంత తక్కువ డేటా వోచర్‌లైన రూ.19, రూ.29ల వ్యాలిడిటీలో ప్రధాన మార్పులు చేసింది. టెంపరరీ డెేటా కోసం ఈ డేటా వోచర్‌లే చాలా మంది రిలయన్స్ జియో కస్టమర్‌లు ఉపయోగిస్తుంటారు. తాజాగా వీటి వ్యాలిడిటీ టైమ్‌ని తగ్గిస్తూ రిలయన్స్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ప్లాన్‌ గడువు ముగిసే వరకు ఈ డేటా వోచర్లకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది.

రూ. 19తో ఒక్క రోజు మాత్రమే!

రూ.19 డేటా వోచర్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారుడి బేసిక్ ప్లాన్ ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యేది. అంటే.. వినియోగదారు బేసిక్ ప్లాన్ 70 రోజుల వరకు చెల్లుబాటు అయితే, అతను రూ.19 డేటా వోచర్ కూడా వేయించుకుంటే 70 రోజులు లేదా డేటా పూర్తిగా ఉపయోగించే వరకు పని చేసేది. అయితే ఇప్పుడు రూ.19 డేటా వోచర్ వ్యాలిడిటీని కేవలం 1 రోజుకు పరిమితం చేశారు. కాబట్టి రూ.19 డేటా వోచర్ కొత్త వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే. రోజు దాటితే అందులో డేటా మిగిలిపోయినా తర్వాత ఉపయోగించడానికి అవకాశం ఉండదు. ఇక, రూ.29 ప్లాన్‌కు గడువును రెండు రోజులుగా నిర్ణయించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button