తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Johnny Master: సుప్రీంకోర్టులో జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్టోబరు 24న హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర మిశ్రతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తాము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని క్లారిటీ ఇచ్చింది. అలా జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్లైంది.

అక్టోబర్ 25న విడుదల

కాగా.. అసిస్టెంట్ డ్యాన్సర్‌పై అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొన్ని రోజుల పాటు చంచల్ గూడ జైల్లో గడిపిన జానీకి ఇటీవల తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్, వారి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరింపులకు పాల్పడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత అక్టోబర్ 25న జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button