జూలై 30: చరిత్రలో ఈరోజు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా సాగిన ఉద్యమానికి స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
వ్యక్తుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా జూలై 30న వ్యక్తుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అక్రమ రవాణా నుంచి బయటపడిన బాధితుల దృష్టి కోణాన్ని ప్రపంచానికి తెలిపేందుకు ఈ రోజును నిర్వహిస్తారు.
సోనూసూద్ బర్త్‌డే
బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ 1973 జూలై 30న జన్మించారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కొవిడ్ లాక్‌డౌన్ వేళ వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని సొంత ఖర్చులతో సొంతూళ్లకు పంపించారు. ఆక్సిజన్ కొరత ఉన్న చోట్ల సిలిండర్లు సమకూర్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
సోను నిగమ్ పుట్టినరోజు
ప్రముఖ సింగర్ సోను నిగమ్ 1973 జూలై 30న జన్మించారు. హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, భాషల్లో అనేక పాటలు పాడారు. 2022లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు.