తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జూలై 31: చరిత్రలో ఈరోజు

మొదటి పేటెంటు జారీ

1790 జూలై 31న అమెరికా మొట్టమొదటి పేటెంటు జారీ చేసింది. వెర్మాంట్‌లోని సామ్యూల్ హాప్కిన్స్‌కి ఎరువులు తయారు చేయటానికి ఈ పేటెంట్ రైట్స్‌ను ఇచ్చారు.

కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు

స్వాతంత్య్ర వచ్చిన మరుసటి ఏడాదే.. అంటే 1948 జూలై 31 కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పడింది. ఇది దేశంలో మొదటి రవాణా వ్యవస్థగా చరిత్రలో నిలిచింది.

హీరోయిన్ కియారా అద్వానీ బర్త్‌ డే

బాలీవుడ్ ప్రముఖ నటి కియారా అద్వానీ 1992 జూలై 31న ముంబైలో జన్మించారు. 2014లో ఫగ్లీ సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఎం.ఎస్.ధోని సినిమా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి మెప్పించారు.

గాయకుడు మహమ్మద్ రఫీ మరణం

ప్రముఖ నేపథ్య గాయకుడు మహమ్మద్ రఫీ జూలై 31, 1980న మరణించారు. హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషా చిత్రాల్లో ఈయన ఎన్నో పాటలు పాడారు. మహమ్మద్ రఫీ పాట వింటూంటే ఏదో తెలియని కొత్త అనుభూతిలోకి వెళ్లిపోతామని మ్యూజిక్ లవర్స్ చెబుతూ ఉంటారు.

నటుడు అల్లు రామలింగయ్య వర్థంతి

అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య జూలై 31, 2004న మరణించారు. అల్లు రామలింగయ్య హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. భారత ప్రభుత్వం అల్లు రామలింగయ్యను 1990లో ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button