తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 14: చరిత్రలో ఈరోజు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో శంషాబాద్ లో నిర్మించారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరును ఈ ఎయిర్ పోర్టుకు పెట్టారు. శంషాబాద్ లో ఎయిర్ పోర్టు నిర్మించకముందు బేగంపేట విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగించేవారు. ఈ విమానాశ్రయాన్ని మార్చి 14, 2008న సోనియా గాంధీ ప్రారంభించారు.

Also Read: వడాపావ్ కు ప్రపంచ గుర్తింపు.. బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ గా ఎంపిక

అమీర్ ఖాన్ పుట్టినరోజు

భారత దేశంలో ప్రముఖ నటుల్లో ఒకరైన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పుట్టినరోజు నేడు. 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, దిల్, లగాన్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ , మంగళ్ పాండే, ఫనా, గజిని, పీకే వంటి… బాలీవుడ్ బాక్సాఫీసులను బద్దలుకొట్టిన బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి… తనకంటూ భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాజా హిందూస్తానీ మూవీ అమీర్ కి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిపెట్టింది.లగాన్ మూవీతో ఆయనకు ఉత్తమ నటుడి ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.

లోకేష్ కనగరాజ్ జననం

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్చి 14, 1986న జన్మించిన ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఖైదీ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు చూసేలా చేశారు. రీసెంట్ గా హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.

Also Read: మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ పేరే

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జయంతి

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879 మార్చి 14 – 1955 ఏప్రిల్ 18 ) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించారు . మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టింది ఇతనే. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా. 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు.

అంతర్జాతీయ గణిత దినోత్సవం

అంతర్జాతీయ గణిత దినోత్సవం (IDM) అనేది ప్రపంచవ్యాప్త వేడుక. ప్రతి సంవత్సరం మార్చి 14న పాఠశాలలు, మ్యూజియంలు, లైబ్రరీలు, ఇతర ప్రదేశాలలో విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నవంబర్ 26, 2019న జరిగిన యునెస్కో 40వ సాధారణ సమావేశం సెషన్‌లో దీనిని ప్రకటించారు. మొదటి వేడుక మార్చి 14, 2020 న జరిగింది.

Also Read: బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు: బండి సంజయ్

మరికొన్ని విశేషాలు

  • తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి 1930, మార్చి14న జన్మించారు. 1931 లో అర్దెషీర్ ఇరానీ దర్శకత్వం వహించిన “ఆలం ఆరా” ముంబై గోరేగావ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటర్ లో విడుదలైంది. ఇది భారతదేశంలో తెరకెక్కిన తొలి టాకీ చిత్రం.
  • 1982లో సిదత్ వెట్టిముని క్రికెట్ లో శ్రీలంకకు తొలి టెస్ట్ సెంచరీ చేశారు. 1996 లో వరల్డ్ కప్ సెమీఫైనల్ లో వెస్టిండిస్ ను 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది.

6 Comments

  1. Thank you for reaching out! If you have any specific questions or topics in mind, please feel free to share them, and I’ll do my best to assist you. Whether you’re curious about a particular technology, scientific concept, literary work, or anything else, I’m here to provide information, advice, or engage in a discussion. Don’t hesitate to let me know how I can help you further!

  2. I’m not sure exactly why but this weblog is loading extremely slow for me.
    Is anyone else having this problem or is it a issue on my end?

    I’ll check back later on and see if the problem still exists.

    Look at my blog post … vpn code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button