తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 16: చరిత్రలో ఈరోజు

పొట్టి శ్రీరాములు జయంతి

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహా పురుషుడు పొట్టి శ్రీరాములు. ఈయన 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మిం చారు. తర్వాత గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవిం చారు. ఇఖ, ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. 1952 అక్టోబర్‌ 10 నుంచి 58 రోజులపాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాగా, డిసెంబర్‌ 15న ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు.

మామిడి వెంకటార్యులు జన్మదినం

తొలి తెలుగు నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు 1764 లో బందరు పరాసుపేటలో జన్మించారు. ఈయన ఆంధ్ర దీపిక పేరుతో రాసిన నిఘంటువు తెలుగు భాషా చరిత్రలో ఒక నూతన ఒరవడికి నాంది పలికింది. ఈయన “ఆంధ్ర లక్షణం”, “పర్యాయ పదాల రత్నమాల”, “శకట రేఫ లక్షణం”, “విశేష లబ్ద చింతామణి”, ” తెలుగు వ్యాకరణం” వంటి గ్రంథాలను రచించారు.

పి.బి. గజేంద్రగడ్కర్ జన్మదినం

భారత సుప్రీంకోర్టు ఏడో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రహ్లాద్ బాలాచార్య గజేంద్రగడ్కర్ 1901 మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. గజేంద్రగడ్కర్ 1945లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1956 జనవరిలో సుప్రీంకోర్టు బెంచ్‌కు పదోన్నతి పొందారు. 1964 ఫిబ్రవరి 1 నుంచి 1966 మార్చి 15 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1972లో భారత ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.

ఆవుల సాంబశివరావు జన్మదినం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మొట్టమొదటి లోకాయుక్త జస్టిస్ ఆవుల సాంబశివరావు 1917 లో గుంటూరు జిల్లా మూల్పూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వర్తించారు.

సముద్రాల రాఘవాచార్య మరణం

తెలుగు చిత్ర పరిశ్రమలో రచయిత, నిర్మాత,దర్శకుడు, నేపథ్యగాయకుడు సముద్రాల రాఘవాచార్య 1968లో మరణించారు. ఈయన 1902లో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో జన్మించారు. తెలుగులో అనేక చిత్రాలకు స్క్రిప్టులను వ్రాసారు. అనేక పాటలు కూడా వ్రాసారు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

జాన్ జేమ్స్ రకర్డ్ మెక్లియాడ్ మరణం

నోబెల్ బహుమతి గ్రహీత జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియోడ్ 1935లో మరణించారు. ఈయన 1876 సెప్టెంబర్ 6న స్కాట్లాండ్ లో జన్మించారు. 1898 లో ఎబర్జీన్ యూనివర్శిటీ నుంచి వైద్యశాస్త్రంలో పట్టా పొందారు. మధుమేహంలో కీలకపాత్ర పోషించే ఇన్సులిన్ ను కనుగొన్నందుకు 1923లో ఈయనకు నోబెల్ బహుమతి లభించింది.

పతంజలి శాస్త్రి మరణం

సుప్రీంకోర్టు రెండో ప్రధాన న్యాయమూర్తి మందకొలత్తూరు పతంజలి శాస్త్రి 1963లో మరణించారు. ఈయన 1889లో జనవరి 4న మద్రాసు సమీపంలోని మందకొలత్తూరులో జన్మించారు. 1910 లో ఎల్ఎల్‌బి పూర్తిచేసి 1912లో న్యాయవాదిగా మారారు. 1951 నవంబరు 7 నుండి 1954 జనవరి 3 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆ పదవిలో పనిచేశారు.

One Comment

  1. I do not even know how I ended up here but I thought this post was great I dont know who you are but definitely youre going to a famous blogger if you arent already Cheers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button