తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 2: చరిత్రలో ఈ రోజు

అబ్బూరి గోపాలకృష్ణ జననం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు, చిత్రకారుడు గోపాలకృష్ణ. ఈయన 1936లో విశాఖపట్నంలోని చిన్నంవారి వీధిలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం అధిపతిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొందాడు. 100కి పైగా కవితలు, తొమ్మిది నాటకాలు రాశారు. అన్నమయ్య యక్షగాన సంప్రదాయం మీద పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందారు. పదవీ విరమణ చేసిన తరువాత, నాటక కళను ప్రోత్సహించడానికి ‘అబ్బూరి కళాకేంద్రం’ను స్థాపించి, వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడానికి అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. గిరీష్ కర్నాడ్ కన్నడంలో రాసిన నాటకాలను తెలుగులోకి ఆయన అనువదించి ప్రదర్శించారు.

దుద్దిళ్ల శ్రీపాదరావు జననం

దుద్దిళ్ల శ్రీపాదరావు తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1935 సంవత్సరంలో తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా ధన్వాడ గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ శాసనసభ (1989-1994) స్పీకర్‌గా 1991, ఆగస్ట్ 19వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1995, జనవరి 11 వరకు ఆ పదవిని నిర్వహించారు. ఈయన హయంలో 1993-94 సంవత్సరంలో మొదటి సారిగా మహిళా శిశు సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీపాదరావు 1983లో ఏడవ శాసనసభకు, 1985లో ఎనిమిదవ శాసనసభకు, 1989లో తొమ్మిదవ శాసనసభకు కరీంనగర్ జిల్లా మంథని నియోజవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

సరోజిని నాయుడు మరణం

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన సరోజిని నాయుడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి. 1925 డిసెంబర్‌లో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా సేవలందించారు. ఆమె తన పన్నెండవ ఏటనే మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగారంటే సరోజిని తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల అంకితభావం మనం అర్థం చేసుకోవచ్చు. మహిళాభివృద్దికి ఎంతో కృషి చేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి పాటు పడ్డారు.1949, మార్చి 2న సరోజిని నాయుడు తుదిశ్వాస విడిచారు.

మరికొన్ని విశేషాలు

  • 2008: కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్‌లో భారత్ విజేతగా నిలిచింది.
  • 1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం లభించింది. – 1991: కారు బాంబు దాడిలో శ్రీలంక రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి రంజన్ విజయరత్నే దుర్మరణం
  • 1983: అమెరికా సహా అనేక దేశాల్లో సీడీ ప్లేయర్ల విక్రయాలు ప్రారంభం
  • 1949: ప్రపంచంలో తొలి ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ అమెరికాలో ఏర్పాటు
  • 1933: ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ‘కింగ్ కాంగ్’ విడుదల
  • 1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వాతంత్రం లభించింది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button