తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Modi: నెహ్రూ తర్వాత ఆ రికార్డు మోదీదే!

భారతదేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టి ప్రధాని పదవిని అధిరోహించిన వారిలో ఇప్పటిదాకా మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తప్ప మరొకరు లేరు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రికార్డును సమం చేయనున్నారు. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొత్తం 16 సంవత్సరాల 282 రోజులపాటు ప్రధాని పదవిలో ఉన్నారు. ప్రధాని పదవిలో ఉండగానే ఆయన మరణించారు. ఆ తర్వాత ఎవరు వరుసగా మూడుసార్లు ఎవరు ప్రధాని కాలేదు. ఆ ఘనత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతోంది.

ఎన్డీయేకు 293 సీట్లు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో సొంతంగా గెలిచింది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 99 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీయూ సహా ఇతర మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్డీయేకు మెజారిటీ భారీగా తగ్గిన విషయం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button