తెలుగు
te తెలుగు en English
Linkin Bioప్రత్యేక కథనం

New Year: జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ ఎందుకు జరుపుకోవాలి?

జవనరి 1.. వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్‌తో పార్టీలు, అర్ధరాత్రి నుంచే కేక్ కటింగ్స్.. గెట్ టు గెదర్స్ కామన్.. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే అసలు నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభం అవుతుంది? ఈ రోజునే న్యూ ఇయర్‌ వేడుకలు ఎందుకు జరుపుకోవాలి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఓ రెండు వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే.

ఆ రోజునే ఎందుకంటే..?

సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా.. క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో రోమన్ నాయకుడు జూలియస్‌ సీజర్‌.. ఇతను రోమన్ రిపబ్లిటక్‌ను రోమన్ సామ్రాజ్యంగా మలచడంలో కీలక పాత్ర వహించారు. ఇతనే జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. రోమన్లకు జనవరి నెల ఎంతో ముఖ్యమైనది. ఎందకంటే వారి దేవత జనస్‌ పేరిటే జనవరి నెల ఏర్పడిందని వారు నమ్ముతారు. అందుకే జనవరి 1ని నూతన సంవత్సరాదిగా ఎంచుకున్నారు. అలా ఆ క్యాలెండర్‌ ప్రపంచమంతా విస్తరించింది. అయితే రోమన్ల సామ్రాజ్యం పతనం అయ్యాక క్రైస్తవం అధికారం చెలాయించింది. దీంతో ఇంగ్లండ్‌ సహా చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ (దేవదూత గాబ్రియెల్‌.. మేరీకి కనిపించి క్రీస్తు జననం గురించి చెప్పిన రోజు)న ఉండాలని కోరుకున్నాయి. ఆ తేదీని నూతన సంవత్సరాదిగా నిర్వహించుకున్నాయి. కానీ అప్పటికే ప్రపంచమంతా జూలియస్‌ క్యాలెండర్‌నే ఫాలో అయ్యింది. అయితే జూలియన్ క్యాలెండర్‌లో 11 నిమిషాలు వ్యత్యాసం ఉందని పోప్‌ 13వ గ్రెగొరీ గమనించారు. కాలగణితంతో కొన్ని లెక్కలు వేసి 1570లో గ్రిగోరియన్ క్యాలెండర్‌ తీసుకొచ్చారు. ఇందులోనూ జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరాదిగా నిర్ణయించారు. దీని కచ్చితత్వాన్ని ప్రపంచమంతా అంగీకరించడంతో క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button