తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Oscar Awards: ఈసారి ‘ఆస్కార్’ ఎవరిని వరించిందంటే..!

సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్‌ అవార్డ్స్-2024 వేడుకలు అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. గత ఏడాది ట్రిపులార్ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ రావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈసారి ‘ఆస్కార్’ ఎవరెవరిని వరించిందోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే పలు కేటగిరీల్లో విజేతలను ప్రకటించారు. అందరూ ఊహించినట్టుగానే హాలీవుడ్ మూవీ ‘ఓపెన్‌ హైమర్’ ఆస్కార్ బరిలో సత్తా చాటింది. మేజర్ కేటగిరీల్లో అవార్డులు సాధించింది. మొత్తం 13 కేటగిరీల్లో పోటికి నిలిచిన ఈ సినిమా చాలా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి.

 ALSO READ: పృథ్వీరాజ్‌పై ప్రభాస్ ప్రశంసలు

ఇప్పటివరకు ప్రకటించిన అవార్డులు

 • ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
 •     ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
 •     ఉత్తమ నటి –  ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
 •     ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
 •     ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
 •     ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
 •     ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
 •     బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
 •     బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌– 20 డేస్ ఇన్ మరియూపోల్
 •     బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే–  కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
 •     బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
 •     బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
 •     బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ – ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
 •     బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ – ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
 •     బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్)
 •     బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
 •     బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
 •     బెస్ట్‌ సౌండ్‌ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
 •     బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
 •     బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ – నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
 •     బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం-ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
 •     బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్ 
 •     బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)

6 Comments

 1. I’m truly enjoying the design and layout of your website.
  It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more
  often. Did you hire out a developer to create
  your theme? Exceptional work!

  Feel free to visit my website; facebook vs eharmony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button