Pakistan: డొనాల్డ్ ట్రంప్ మా నాన్న.. పాక్ యువతి సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ సభ్యుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. రెండోసారి ఆ దేశ అధ్యక్ష పీఠంపై కూర్చోనున్నారు. దీంతో అమెరికా వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ ఆయన అభిమానులు పండుగు చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నా ట్రంప్ బాధపడుతున్నారు!
పాకిస్తాన్‌కు చెందిన ఓ ముస్లిం యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియోలో యువతి తాను ముస్లింనని చెప్తునే.. తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన కూతురును సరిగా చూసుకోవడం లేదని తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి మీడియాతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.