తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Pandemic in China: చైనాను వణికిస్తున్న కొత్త వైరస్.. మరోసారి ‘హెల్త్ ఎమర్జెన్సీ’ తప్పదా?

చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ ఉత్పాతం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. కరోనాను అలా మర్చిపోతున్నామో లేదో.. చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. హ్యూమన్‌ మెటానిమో (HMPV) వైరస్‌ చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ వైరస్‌ సోకినవారిలో కొవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ‘హెల్త్ ఎమర్జెన్సీ’ తప్పదా? అన్న చర్చ కూడా మొదలైపోయింది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

కరోనా వైరస్ లాగే HMPV వైరస్ కూడా పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు దీని అధిక వ్యాప్తికి కారణమవుతాయి.

అదే నిర్లక్ష్య ధోరణిలో చైనా, డబ్ల్యూహెచ్‌వో

ఈ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని.. చైనాలోని ఆస్పత్రులు అన్నీ నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నా.. చైనా మాత్రం నోరెత్తటం లేదు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ఎలాంటి అలర్ట్ ఇవ్వటం లేదు. గతంలో కరోనా వైరస్ సమయంలోనూ ఇలాగే చైనా, డబ్ల్యూహెచ్‌వో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఇప్పుడు కూడా అలాగే కప్పిపుచ్చే విధంగానే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button