ప్రత్యేక కథనం
Prabhas: రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన ‘బాహుబలి’
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. కోటి చొప్పున మొత్తం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరద సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన వలసిందిగా తన అభిమానులకు ప్రభాస్ పిలుపు ఇచ్చారు. కాగా.. టాలీవుడ్ చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోలు విరాళాలు ప్రకటించారు.