తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Red Sandalwood: ఎర్రచందనం కేవలం మన శేషాచలం అడవుల్లోనే పండుతుందా? ‘పుష్ప’లో చూపించింది నిజమేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 & 2 సినిమాల కథ మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూనే తిరుగుతుంది. పుష్ప పార్ట్ 1లో సిండికేట్ లీడర్ స్థాయికి ఎదిగిన పుష్పరాజ్.. ఇక పార్ట్ 2లో ఎర్రచందనం స్మగ్లింగ్‌తో పుష్పరాజ్ ఏకంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించినట్లుగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అయితే.. సినిమా విషయం పక్కన పెడితే.. అసలు ఇంతకీ ఈ ఎర్రచందనం రియల్ స్టోరీ ఏంటి? ఇది కేవలం ఏపీలోని శేషాచలం అడవుల్లో మాత్రమే ఎందుకు పండుతుంది? ఇది నిజంగానే బంగారం కంటే విలువైనదా? ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి ఎందుకంత డిమాండ్ ఉంది? ఈ ఎర్రచందనంతో ఏం చేస్తారు? ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను ఎందుకు అతిపెద్ద నేరంగా పరిగణిస్తారు? వంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం.

శేషాచలంలో మాత్రమే!

పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ చెప్పినట్టు ప్రపంచంలోనే అరుదైన ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో గల శేషాచలంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువగా శేషాచలం, వెలుగొండ కొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది. ప్రధానంగా, శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక, చిత్తూరు జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ సాధారణంగానే ఈ చెట్లు పెరుగుతాయి. కానీ వీటిని రైతులు పెంచాలంటే కచ్చితంగా ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే.

ఎందుకు అంత డిమాండ్?

ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవని. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనం తో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్ల లో బహుమతిగా ఇస్తుంటారు. చైనా, జపాన్‌‌తో పాటు రష్యా వాళ్లు కూడా ఎర్రచందనాన్ని విరివిగా వినియోగిస్తారు. ఎర్రచందనంలో ఔషధ గుణాలు పుష్పలంగా ఉంటాయి. వయాగ్రా, కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో వీటిని వాడుతారు. అంతేకాదు, అల్సర్‌ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్నిశుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్ర చందనంలో ఉంటాయి. విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

స్మగ్లర్లపై ఉక్కుపాదం

అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ అతిపెద్ద నేరం. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడితే జీవితాంతం జైల్లో గడపాల్సిందే. మరోవైపు, విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. యాంటీ స్మగ్లర్స్ టాస్క్‌ఫోర్స్‌ను సైతం ఏర్పాటు చేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ ఎర్రచందనం కూలీలు చెట్లు నరకుండా ఇది అడ్డుకుంటుంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్‌లో పోలీసు, ఫారెస్ట్, ఏపీఎస్‌పీ, ఏఆర్ ఫోర్స్, సివిల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్‌క్వార్టర్‌‌గా ఇది పని చేస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button