తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో- బస్సు ఢీ, ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు మోతె మండలం బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు మోతె గ్రామంలో సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారి అండర్‌ పాస్‌ వంతెన వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది.

Also read: Drugs: గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నేవీకి చిక్కిన స్మగ్లర్లు

ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోనకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button