తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Samantha: సెకండ్ హ్యాండ్, యూజ్డ్ ట్యాగ్స్ ఎందుకు.. హీరోయిన్ సమంత ఎమోషనల్!

స్టార్ హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. విడాకులు, మయోసైటిస్ సమస్యల తర్వాత తాను మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. మహిళలు ఎదుర్కొనే సామాజిక సవాళ్ల గురించి ప్రస్తావించారు. ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందించే సమాజంలో ప్రస్తుతం బతుకుతున్నామని అసహనం వ్యక్తంచేశారు. తనపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు.

ఎంతో బాధించాయి!

‘డివోర్స్‌ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్‌ తగిలిస్తుంది. సెకండ్‌ హ్యాండ్‌, ఆమె జీవితం వృథా, యూజ్డ్‌.. ఇలాంటి ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని ఇవి ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న ఆ అమ్మాయిని ఇవి మరింత నిరాశపరుస్తాయి. నా గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి మాట్లాడాలని అనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతోమంది నాకు మద్దతుగా నిలిచారు’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button