తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Shivaratri: మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా శివనామ స్మరణే వినిపిస్తోంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, మేడ్చల్ జిల్లా కీసర గుట్ట, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయం, కురవి వీరభద్ర స్వామి ఆలయం, అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయాల్లో అభిషేకం చేసుకునేందుకు తెల్లవారుజామున నుంచి భక్తులు బారులు తీరారు.

ALSO READ: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తర్వలోనే వారికి అవార్డులు

ఏపీలోనూ మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలో గోదావరి స్థాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలం, త్రిపురాంతకం, భైరవకోన, బెస్తవారిపేట, కోటప్పకొండ తదితర ఆలయాలకు భక్తులు తెల్లవారు ఝామునుంచే పోటెత్తారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి స్వామివార్లను దర్శనం చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button