తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Sitaram Yechuri: సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం!

ప్రముఖ రాజకీయవేత్త, పోరాట యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. సీతారాం ఏచూరి దశాబ్దాలుగా పార్టీలో, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కేవలం కమ్యూనిస్ట్‌గా మాత్రమే కాకుండా ఆర్థిక వేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్ట్‌గా ఆయన ఎంతో గుర్తింపు పొందారు. ఏచూరి.. 1992 నుంచి సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

హైదరాబాద్‌లోనే బాల్యం

సీతారాం ఏచూరి 12 ఆగస్టు 1952న మద్రాస్‌లో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఏచూరి బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు. 1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు.

విద్యార్థి నేతగా..

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button