తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

INDIAN 2: ఇండియన్ 2 రిలీజ్ ఆపాలంటూ కేసు.. ‘వర్మకలై’ ఎలా వాడారని ప్రశ్న?

విశ్వనటుడు కమల్ హాసన్, విలక్షణ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’మూవీ జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆపేయాలని కోరుతూ కేసు నమోదైంది.’వర్మ కలై'(కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్)మధురైలోని హెచ్‌ఎంఎస్ కాలనీలో ఆసన్ రాజేంద్రన్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ కేసు పెట్టాడు.

Read also: Harom Hara: సుధీర్ బాబు ‘హరోంహర’ ఓటీటీలోకి వచ్చేస్తోంది!

కాగా 1996 లో విడుదలైన కమల్ హాసన్‌ భారతీయుడు సినిమా కోసం వర్మ కలై శిక్షణ నేర్పినట్లుగా తనకు క్రెడిట్ దక్కిందని తెలిపారు. అయితే భారతీయుడు 2 సినిమాలో తన మెళకువలు ఉపయోగించడానికి మాత్రం.. ఇండియన్ 2 మూవీ టీమ్ అతని నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమాను నిషేధించాలని అతను కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ పై మధురై జిల్లా కోర్టులో నిన్న విచారణ జరిగింది. రాజేంద్రన్‌ చేసిన ఫిర్యాదుపై స్పందించేందుకు ‘ఇండియన్ 2’ మేకర్స్ సమయం కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటితి వాయిదా వేశారు.

ఇటీవల డైరెక్టర్ శంకర్ ఇండియాటుడే.ఇన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. “కమల్ హాసన్ తన పాత్ర కోసం ఎలాంటి హోంం‌వర్క్ చేస్తాడో తనకు తెలియదని అన్నారు. అయితే ‘ఇండియన్ 2’కోసం’వర్మ కలై’శిక్షణ కోసం ప్రకాశం గురుక్కల్‌ను సంప్రదించినట్లు శంకర్ వెల్లడించారు. కేరళ నుంచి ప్రకాశం గురుక్కల్‌ని తీసుకొచ్చి ఆయన గైడెన్స్‌ తీసుకున్నామని, వర్మ కలైని సినిమాలో చూడొచ్చు” అని శంకర్ చెప్పారు. ఇక రేపు జరగబోయే తదుపరి విచారణలో ఇండియన్ 2 మేకర్స్ ఎలాంటి సమాధానం చెప్పనున్నారో.. కోర్టు ఎలా స్పందించి న్యాయం చేయనుందో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button