తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana: ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. కార్యక్రమాలివే!

జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌ వేదిక కానుంది. ఉదయం సీఎం రేవంత్ గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమవుతాయి. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఈ.డీ స్క్రీన్‌లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి సైతం ఏర్పాట్లు చేశారు.

ALSO READ: తెలంగాణలో రేవంత్ మార్క్ పాలన!

ట్యాంక్ బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు

సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button