తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana: దంచికొడుతున్న ఎండలు… ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలు

ఎండలు దంచికొడుతున్నాయి… రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ మంట పుట్టిస్తున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దని సూచించారు. అత్యవసరం అయితే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలన్న ఆయన…లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

Also Read: జిత్తుల మారి పొత్తుల ముఠా తయారైంది..నేరుగా దెబ్బ కొట్టలేకనే!

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆర్వీ కర్జన్‌ సలహాలు, సూచనలు జారీ చేశారు.

Also Read:  కేటీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదు… దేనికైనా సిద్ధమే: కొండా సురేఖ

ఎండలో పనిచేయడం, ఆటలాడటం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని చెప్పారు. పార్‌ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మద్యం, చాయ్‌, కాఫీ, స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని చెప్పారు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్‌ కంటే ఎకువగా నమోదవడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.

Also Read: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్..ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ

ఈ సమయంలో ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఇక, ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్లు, జర్నలిస్టులు, ఎక్కువగా తిరిగేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇక, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అంగన్ వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విరివిగా అందుబాటులో పెట్టామని.. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని.. ఈ కాలంలో ఫుడ్, వాటర్ ఎక్కువగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉందని.. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button