తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Threatening Call: ప్రధాని మోదీ హత్యకు ప్లాన్.. పోలీసులకు ఓ మహిళ నుంచి బెదిరింపు కాల్!

ఇటీవల కాలంలో రాజకీయ, సినీ ప్రముఖులకు వస్తున్న బెదిరింపు కాల్స్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై బెదిరింపు కాల్ రావడం సంచలనంగా మారింది. ముంబై ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితురాలి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ను ట్రేస్‌ చేస్తున్నారు. సదరు మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

అన్ని కాల్స్ వారికే!

కాగా.. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబై ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆయనకు మహారాష్ట్ర పోలీసులు జడ్ ప్లస్ భద్రతను కల్పించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button