తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 10: చరిత్రలో ఈరోజు

అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం ( ఇంటర్నేషనల్ సిబ్లింగ్ డే)

అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. వ్యక్తి జీవితంలో తన తోడబుట్టిన వారి ప్రాముఖ్యత ఏంటో తెలిపేందుకే ఈ రోజును జరుపుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో మొదటి స్నేహితులు తోబుట్టువులే. మొదటిసారిగా న్యూయార్క్ కు చెందిన క్లాడియా ఎవర్ట్ ఈ రోజును జరుపుకున్నారు. ఆమె చిన్నతనంలోనే తన సోదురుడు, సోదరిని పోగొట్టుకుంది. వారి ప్రాముఖ్యత ఎంటో తెలిపేందుకే 1995 నుంచి ఈ రోజును నిర్వహిస్తున్నారు.

ప్రపంచ హోమియోపతి దినోత్సవం

ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. హోమియోపతి పితామహుడు డా. క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ జయంతి గుర్తుగా ఈ రోజును నిర్వహిస్తారు. జర్మన్ దేశానికి చెందిన ఈ వైద్యుడు 1796లో మొదటిసారి ఈ పదాన్ని కనిపెట్టారు.

సి.వై. చింతామణి పుట్టినరోజు

ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ నేత చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి 1880 విజయనగరంలో జన్మించారు. పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన పాత్రికేయుడు. అలహాబాదు నుండి వెలువడిన లీడర్ అనే ఆంగ్ల పత్రికకు 1909 నుండి 1934 వరకు మూడు దశాబ్దాలపాటు సంపాదకుడిగా పనిచేశారు. ఇండియన్ హెరాల్డ్, స్టాండర్డ్ పత్రికలను కూడా వ్యవస్థీకరించారు.

ఒమర్- ఎల్- షరీఫ్ పుట్టినరోజు

ప్రముఖ హాలీవుడ్ నటుడు ఒమర్ ఎల్ షరీఫ్ 1932 ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో జన్మించారు. లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. 1954లో సిర్రా ఫిల్- వాడి అనే ఈజిప్టియన్ చిత్రంతో నటనా జీవితాన్ని ప్రారంభించారు. దాదాపు 70 చిత్రాల్లో నటించారు.

ఘనశ్యాం దాస్ బిర్లా పుట్టినరోజు

భారతదేశ అతి పెద్ద వ్యాపార వేత్త జె.డి. బిర్లాగా పిలవబడే ఘన్ శ్యామ్ దాస్ బిర్లా 1894 పిలాని గ్రామంలో జన్మించారు. ఘనశ్యామ్ తన కుటుంబ పెద్దలవలే కలకత్తా వెళ్లి బట్టల వ్యాపారం ప్రారంభించాడు. వస్తు తయారీ యూనిట్లను దేశవ్యాప్తంగా స్థాపించాడు. 1919లో గవాలియర్ పట్టణంలో సొంతంగా మిల్లు స్థాపించాడు. 1926లో బ్రిటిష్ వారి హయాంలో శాసనసభకు ఎన్నికయ్యారు. కార్ల వ్యాపారంలో ప్రవేశించి 1940లో హిందుస్తాన్ మోటర్స్ అనే సంస్థను స్థాపించారు. 1943 లో యూకో బ్యాంక్ ను కలకత్తాలో ప్రారంభించారు.

మొరార్జీ దేశాయ్ మరణం

భారతదేశ మాజీ ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధడు మొరార్జీ దేశాయ్ 1995 న్యూ ఢిల్లీలో మరణించారు. ఈయన 1896 ఫిబ్రవరి 29న బొంబాయిలోని (ప్రస్తుత గుజరాత్) భడేలీ అనే ప్రాంతంలో జన్మించారు. 1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారతదేశ నాలుగో ప్రధానిగా సేవలందించారు. బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను చైనా, పాకిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేశారు.

మరిన్ని విశేషాలు

సాతంత్ర్య సమరయోధుడు, రచయిత దశిక సూర్యప్రకాశరావు 1898 కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు.

వార్నర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-డీ చిత్రం హౌస్ ఆఫ్ వ్యాక్స్ అమెరికన్ స్టూడియోలో ప్రదర్శించబడింది.

మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత మహమ్మద్ రజబ్ అలీ 1996 లో మరణించారు.

ఆధ్యాత్మిక వేత్త విద్యా ప్రకాశానందగిరి స్వామి 1998లో మరణించారు

One Comment

  1. Stumbling upon this website was such a delightful find. The layout is clean and inviting, making it a pleasure to explore the terrific content. I’m incredibly impressed by the level of effort and passion that clearly goes into maintaining such a valuable online space.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button