తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

జాతీయ సముద్ర దినోత్సవం

భారత్ లో 61వ జాతీయ సముద్ర దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. అంతర్జాతీయ వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై సముద్రాలు చూపే ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రోజును నిర్వహిస్తారు. కాగా 1964 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ సముద్ర రంగంలో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలు సాధించిన వారికి NMD అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇవ్వబడును.

బాబు జగ్జీవన్ రాం పుట్టినరోజు

స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయ వేత్త బాబు జగ్జీవన్ రాం 1908 బీహార్ లోని అర్రా సమీపంలోని చంద్వాలో జన్మించారు. బీహార్ లో వెనుకబడిన కులాల అభ్యున్నతికి కృషి చేశారు. అలాగే 40 ఏళ్లపాటు కేంద్రంలో వివిధ మంత్రి పదవులు, ఉప ప్రధానిగా సేవలందించారు. అంటరానితనం రూపుమాపేందుకు 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెన్ లీగ్ అనే సంస్థ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు. భారతదేశ మొదటి కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 ఇండో- పాక్ యుద్ధం సమయంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. 1977-79 మధ్య ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.

చేగొండి వెంకట హరిరామజోగయ్య పుట్టినరోజు

రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సినీ నిర్మాత చేగొండి వెంకట హరిరామజోగయ్య 1937 పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా సేవలందించారు. ఆయన 2004 లో నరసాపురం ఎంపీగా కాంగ్రెస్ తరపున గెలిచారు. హరిరామ జోగయ్య పలు చిత్రాలకు నిర్మాతగా కూడా పనిచేశారు. సినీ పరిశ్రమలో చేగొండి హరిబాబుగా ప్రసిద్ధి చెందారు.

తలసిల క్రాంతి కుమార్ పుట్టినరోజు

టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు తలసిన క్రాంతి కుమార్ 19421 విజయవాడలోని పెనమలూరులో జన్మించారు. పలు సినిమాల్లో స్క్రీన్ రైటర్ గా వ్యవహరించారు. సినీరంగానికి చేసిన సేవలకు గాను రెండు ఫిల్మ్ ఫేర్, నాలుగు నంది పురస్కారాలను అందుకున్నాడు. ఆయన తెరకెక్కించిన స్రవంతి సినిమాకు గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. సీతారామయ్యగారి మనవరాలు సినిమా భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. సౌందర్య ప్రధాన పాత్రలో తీసిన 9 నెలలు సినిమా టొరంటోలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.

బిత్తిరి సత్తి పుట్టినరోజు

టీవీ యాంకర్, నటుడు బిత్తిరి సత్తి 1979 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో జన్మించాడు. ఇతని అసలు పేరు కావలి రవికుమార్ (చేవెళ్ల రవి). 2012లో జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే రియాలిటీ షోలో మొదటిసారి పాల్గొన్నాడు. ఇక 2015లో వీ6 లో చేరాడు. ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు వచ్చే తీన్మార్ వార్తలలో తీన్మార్ సావిత్రితో కలిసి సమాచారమిచ్చాడు. ఈ కార్యక్రమంతోనే బిత్తిరి సత్తికి మంచి పేరు వచ్చింది. ఇక 150 పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. సీమశాస్త్రీ సినిమాలో చిన్న పాత్రతో తెలుగు తెరపైన కనిపించాడు. రుద్రమదేవిలో కనిపించాడు. 2019లో వచ్చిన తుపాకి రాముడు సినిమాలో హీరోగా నటించాడు.

రష్మికా మందన్న పుట్టినరోజు

భారతీయ సినీ నటి రష్మికా మందన్న 1996 కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా విరజ్ పేటలో జన్మించింది. 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమైంది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది. నాగశౌర్యతో కలిసి చేసిన ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీతాగోవిందం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. ఆ తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది. 2021లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం. అలాగే ఇదే సంవత్సరంలో మిషన్ మజ్ను సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తెలుగులో అల్లుఅర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటిగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. మరోవైపు బాలీవుడ్ లో అనిమల్ సినిమాతో రష్మికా రేంజ్ హైలెవల్ కి చేరుకుంది.

పూనమ్ బజ్వా పుట్టినరోజు

ప్రముఖ నటి పూనమ్ బజ్వా 1985 ముంబైలో జన్మించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. 2005లో మిస్ పూణే పోటీల్లో గెలిచింది. 2005లో తొలిసారిగా అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన బాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగులో నటించింది. పలు చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

ఎస్పీ కోదండపాణి మరణం

సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి 1974లో మరణించారు. ఈయన 1932 గుంటూరులో జన్మించారు. 1953లో వచ్చిన నా ఇల్లులో మొదటిసారిగా గ్రూప్ లో పాడే అవకాశం వచ్చింది. 1955లో వచ్చిన సంతానం సినిమాతో గాయకుడిగా పరిచయమయ్యారు. 101 సినిమాలకు సంగీత దర్శకత్వం చేశారు. ఎన్నో వందల పాటలకు స్వరాలు అందించారు.

దివ్యభారతి మరణం

ఉత్తరాది నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకున్న దివ్యభారతి 1993 లో మరణించింది. ఈమె 1974 ఫిబ్రవరి 25న ముంబైలో పుట్టింది. ప్రముఖ నిర్మాత రామానాయుడు.. బొబ్బిలి రాజా సినిమాతో దివ్యభారతిని తెలుగు తెరకు పరిచయం చేశారు. అనంతరం దక్షిణాదిలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ లోకి వెళ్లింది. 1992-93 మధ్యలోనే 14 సినిమాలు చేసింది. 19 ఏళ్ల వయసులో అనుమానాస్పదస్థితిలో మరణించింది.

మరిన్ని విశేషాలు

కేరళలో 1957 లో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు. ఇఎంఎన్ నంబూద్రిపాద్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రముఖ నటుడు చంద్రమౌళి 2018 హైదరాబాద్ లో మరణించారు. పలు సీరియళ్లు, సినిమాల్లో నటించారు.

28 Comments

 1. Stumbling upon this website was such a delightful find. The layout is clean and inviting, making it a pleasure to explore the terrific content. I’m incredibly impressed by the level of effort and passion that clearly goes into maintaining such a valuable online space.

 2. I do trust all the ideas you’ve offered to your post. They’re
  very convincing and can certainly work. Nonetheless, the posts are too quick for novices.
  Could you please extend them a little from subsequent time?
  Thanks for the post.

 3. Does your site have a contact page? I’m having a tough time locating it but,
  I’d like to send you an email. I’ve got some recommendations for your blog you might
  be interested in hearing. Either way, great blog and I look forward to
  seeing it develop over time.

 4. A fascinating discussion is definitely worth comment.
  I do think that you need to publish more about this issue, it may
  not be a taboo subject but typically people do not discuss these subjects.
  To the next! Kind regards!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button