తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జూలై 10: చరిత్రలో ఈరోజు

జాతీయ చేపల రైతుల దినోత్సవం:

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. 1957లో కార్ప్ రకం చేపను విజయవంతంగా పెంచిన శాస్త్రవేత్తలు డా. కెహెచ్ అలీకున్హి, డా. హెచ్ఎల్ చౌధురి జ్ఞాపకార్ధం ఈరోజును నిర్వహిస్తారు. ఈ యుగపు ఆవిష్కరణగా దీనిని గుర్తిస్తారు. చేపల పెంపకంలో రైతులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం, చేపల పెంపకాన్ని పెంచడం ముఖ్య ఉద్దేశం.

నికోలా టెస్లా డే:

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్ నికోలా టెస్లా 1856 ప్రస్తుత క్రొయేషియాలోని స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించారు. విద్యుత్, అయస్కాంతాలకు సంబంధించి విప్లవాత్మకమైన విషాయాలను కనుగొన్నారు. వైర్ లెస్ (రేడియో) కమ్మూనికేషన్ ప్రదర్శించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయస్కాంత ప్రేరణ ఎస్ఐ ప్రమాణానికి ఆయన గౌరవార్థం టెస్లాగా నామకరణం చేశారు.

కోన ప్రభాకర్ రావు పుట్టినరోజు:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, మహారాష్ట్ర, పాండిచ్చేరి, సిక్కిం మాజీ గవర్నర్, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కోన ప్రభాకర్ రావు 1916 బాపట్లలో జన్మించారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 198-81 మధ్య ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు.

కోట శ్రీనివాసరావు పుట్టినరోజు:

తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాసరావు 1942 కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో వందల చిత్రాలు చేశారు. 1999-2004 మధ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా బీజేపీ తరపున ఎన్నికయ్యారు. 1978లో ప్రాణం ఖరీదు అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

సునీల్ గవాస్కర్ పుట్టినరోజు:

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 1949 ముంబయిలో జన్మించారు. ఈయన పూర్తిపేరు సునీల్ మనోహర్ గవాస్కర్. ముద్దుగా (సన్నీ) అని పిలుచుకుంటారు. 1970, 1980 దశకంలో టీమిండియా క్రికెట్ కు ఓపెనర్ గా 34 టెస్టు సెంచరీలు చేసి అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. తన కెరీర్ లో 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు.

మరిన్ని విశేషాలు:

విశాఖ జిల్లా పద్మానాభం వద్ద 1794లో విజయనగర రాజులు, బ్రిటీష్ సేనాలకు మధ్య పద్మానాభ యుద్ధం జరిగింది.

విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లో 500 మంది బోయసైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి సంపదను దోచుకున్నాడు.

భారత లోక్ సభ స్పీకర్ గా 1991లో శివరాజ్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు.

బాలనటిగా గుర్తింపు పొందిన దక్షిణ భారత నటి బేబీ షామిలి 1987 చెన్నైలో జన్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button