తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూన్ 10

మూలికలు, సుగంధ ద్రవ్యాల దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 10వ తేదీన జాతీయ మూలికలు, సుగంధ ద్రవ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మూలికలు, సుగంధ ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

భారత క్రికెట్ జట్టు మొదటి టెస్ట్ విజయం

1986లో ఇదే రోజున భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ క్రికెట్ స్టేడియంలో మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో చారిత్రాత్మక వేదికపై ఇంగ్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.

బాలకృష్ణ పుట్టినరోజు

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ 1960లో జన్మించారు. 14వ ఏటనే ‘తాతమ్మ కల’ చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. వందకు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, పురస్కారాలు సొంతం చేసుకున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచిత సేవలందిస్తున్నారు.

ఇ.వి.వి. సత్యనారాయణ పుట్టినరోజు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ఇ.వి.వి.గా ప్రసిద్ధి చెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ 1958లో జన్మించారు. ఎన్నో కామెడీ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. అప్పుల అప్పారావు, జంబలకిడి పంబ, హలో బ్రదర్ వంటి హిట్ చిత్రాలు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button