తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: మే 31

పొగాకు వ్యతిరేక దినోత్సవం

ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 1988 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి

తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ 1943లో గుంటూరు జిల్లాలో జన్మించారు. దాదాపు 340 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు.

మిల్వినా డీన్ మరణం

1912 ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ మునిగిపోయిన ఘటనలో ప్రాణాలతో బయటపడి అప్పటికి జీవించి ఉన్న చివరి వ్యక్తి మిల్వినా డీన్ 2009లో ఇదే రోజున మరణించారు.

పెరూలో భారీ భూకంపం

దక్షిణ అమెరికాలోని పెరూలో 1970లో ఇదే రోజున 7.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప వల్ల దాదాపు 67,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

దువ్వూరి సుబ్బమ్మ వర్ధంతి

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ, ‘దేశ బాంధవి’ బిరుదు పొందిన దువ్వూరి సుబ్బమ్మ 1964లో మరణించారు. స్త్రీ జనోద్ధరణకు ఈమె విశేష కృషి చేశారు. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button