తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

TS Inter Exams: ఇంటర్ విద్యార్థులకు ఊరట… నిమిషం నిబంధన తొలగింపు

ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఒక్క నిమిషం నిబంధనను సడలిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. దీంతో విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. ఇందులో భాగంగా ఇంటర్ పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా ఎగ్జామ్ రాసేందుకు అనుమతించనున్నారు. కాగా, గతంలో విద్యార్థులు కాస్త ఆలస్యంగా వచ్చిన కేంద్రంలోకి అనుమతించకపోవడంతో మినిట్ నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

ALSO READ: గుడ్ న్యూస్.. జీరో బిల్లులు వచ్చేశాయ్!

రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలు..

ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పరీక్షల్లో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించేందుకు ఇంటర్ బోర్డు ‘టెలి మనస్’ పేరుతో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040-24655027కు కాల్ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button