ప్రత్యేక కథనం
Virat Kohli: అందుకే కదా.. ఆయనను అందరూ అంటారు.. రన్ మెషీన్ అని!
పరుగుల రారాజు.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ తన కెరీర్లో సాధించిన అనితర సాధ్యమైన రికార్డులేంటో చూద్దాం.
రికార్డుల వీరుడు!
- వన్డేల్లో అత్యధిక సెంచరీలు (50) సాధించిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. సచిన్ (49)ను అధిగమించి మరీ అగ్రస్థానం సాధించాడు.
- అత్యంత వేగంగా వన్డేల్లో 8వేల పరుగులు (175 ఇన్నింగ్స్‌లు), 9 వేల పరుగులు (194 ఇన్నింగ్స్‌లు), 10 వేల పరుగులు (205 ఇన్నింగ్స్‌లు), 11 వేల పరుగులు (222 ఇన్నింగ్స్‌లు), 12 వేల పరుగులు (242 ఇన్నింగ్స్‌లు), 13 వేల పరుగులు (267 ఇన్నింగ్స్‌లు)
- వన్డే ప్రపంచకప్ (2011), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2013), టీ20 ప్రపంచకప్‌ను (2024) నెగ్గిన జట్లలో విరాట్ సభ్యుడు. వన్డే ప్రపంచకప్ పోటీల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ (1,795). కేవలం 37 మ్యాచుల్లోనే 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు.
- టీ20 సిరీసుల్లో ఏడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లను నెగ్గిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ (4,231) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ (4,188). కానీ, రోహిత్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం గమనార్హం. రోహిత్ 151 ఇన్నింగ్స్ తీసుకోగా.. కోహ్లీ 117 ఇన్నింగ్స్‌ల్లోనే రాబట్టాడు. వీరిద్దరూ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
- కెప్టెన్‌గా భారత జట్టును అత్యధిక మ్యాచుల్లో నడిపించిన మూడో సారథి విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 135 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు.
- టెస్టుల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ను గెలిపించిన సారథిగా ఘనత సాధించాడు. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని అతడి నాయకత్వంలోనే వరుసగా రెండుసార్లు టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది.