తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌.. మరిచిపోయిన మెసేజ్‌లను కూడా గుర్తు చేస్తుంది!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటి కప్పుడు తన యూజర్ల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వదిలేసిన చాట్‌లను కూడా ఈ ఫీచర్ రిమైండ్‌ చేస్తుంది. అప్లికేషన్‌లో చదవకుండా వదిలేసిన సందేశాల్ని ఇది గుర్తుచేస్తుంది. అయితే గతంలో స్టేటస్ అప్‌డేట్ల రిమైండింగ్‌ కోసం మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫీచర్‌.. తాజాగా చాట్‌లలో చదవని సందేశాలను ట్రాక్‌ చేయడంలోనూ మీకు సాయం చేస్తుంది.

త్వరలోనే అందుబాటులోకి!

అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్ష దశలో భాగంగా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. లైవ్‌లోకి రాగానే Settings > Notifications > Reminders ని ఎంచుకొని ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. అన్ని కాంటాక్ట్‌లకు సంబంధించి నోటిఫికేషన్‌ వస్తుందా, లేదా? అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button