winter solstice: నేడు ఆకాశంలో అద్భుతం.. పగలు 8 గంటలు.. రాత్రి 16 గంటలు.. ఎందుకో తెలుసా?
ఆకాశంలో ఇవాళ అద్భుతం జరగనుంది. సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. కానీ డిసెంబర్ 21న.. అంటే ఇవాళ.. సుదీర్ఘమైన రాత్రి ఉంటుందని శాస్రవేత్తలు చెబుతున్నారు. ఏకంగా 16 గంటలు రాత్రి సమయం ఉంటుందట. ఇవాళ పగలు కేవలం 8 గంటలేనంట. ఇలా పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని శీతాకాలపు అయనాంతం (వింటర్ సోల్స్టీస్) అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబరు 19 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది.
కనిష్ట ఉష్ణోగ్రతలు!
వింటర్ సోల్స్టీస్ ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఇక ఈ రోజున భూమి దాని ధృవం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఉష్ణోగ్రతలలోనూ మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇక, ఉత్తర భారతదేశంలో ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. ఈ రోజున అన్నదానం, బట్టలు, దానధర్మాలు చేయడం శుభప్రదం. బలహీనమైన సూర్యునికి బలాన్ని ఇవ్వడానికి ఓం సూర్యై నమః అనే మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు.