తెలుగు
te తెలుగు en English
క్రికెట్

BCCI: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఆనందంలో జట్టు సభ్యులు

బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించి T20 ఫార్మాట్ లో ప్రపంచ టైటిల్ ను అందుకుంది. టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ మేరకు భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ జట్టు అద్భుతమైన విజయం సాధించినందుకు.. టీమిండియా జట్టుకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ ప్రైజ్ మనీ రూ. 20 కోట్ల రూపాయలు కాగా.. బీసీసీఐ 10 రెట్లు ప్రైజ్ మనీని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఎవరెవరికి ఎంత ప్రైజ్ మనీ అనే విషయాన్ని వెల్లడించింది.

Read also: Hardik: మరోసారి తెరపైకి నటాషా, హార్దిక్ విడాకులు!

భారీ నగదు బహుమతిని టీమిండియా ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, సీనియర్ సెలక్షన్ కమిటీ పంచుకుంటారు. రివార్డ్‌లో భాగంగా స్క్వాడ్ లోని 15 మంది సభ్యులతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక్కొక్కరు రూ.5 కోట్లు అందుకుంటారు. 15 మంది స్క్వాడ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కు రూ. 5 కోట్లు రివార్డ్ దక్కింది. ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్ లో భాగమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌కు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు ఇవ్వనున్నారు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సీనియర్ సెలక్షన్ కమిటీకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు బహుకరిస్తారు. టీమ్ ఇండియాకు చెందిన నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు.. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌ కోటి రూపాయలు చొప్పున నగదు అందుకున్నారు. భారత క్రికెట్ జట్టులోని ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు (కమలేష్ జైన్, యోగేష్ పర్మార్, తులసి రామ్ యువరాజ్), ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు (రాఘవింద్ర ద్వీగి, నువాన్ ఉడెనేకే, దయానంద్ గరానీ), ఇద్దరు మసాజర్లు (రాజీవ్ కుమార్, అరుణ్ కనడే), బలం, కండిషనింగ్ కోచ్ (సోహమ్ దేశాయ్) రూ. 2 కోట్లు చొప్పున నగదు అందనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button