తెలుగు
te తెలుగు en English
క్రికెట్

BCCI: శ్రీలంక పర్యటనకు భారత జట్టు.. రోహిత్, కోహ్లీ, బుమ్రాకు రెస్ట్

టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో యువ క్రికెటర్లు ఈ సిరీస్ లో సత్తా చాటుతున్నారు. ఈ సిరీస్ తర్వాత మన క్రికెట్ జట్టు శ్రీలంకకు బయల్దేరుతుంది. ఆగస్టులో శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేస్ గన్‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి నిరంతరాయం క్రికెట్ ఆడుతున్న స్టార్ ప్లేయర్లు లాంగ్‌‌‌‌‌‌‌‌ బ్రేక్ కావాలని బీసీసీఐని కోరినట్టు తెలుస్తోంది.

Read also: BCCI: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఆనందంలో జట్టు సభ్యులు

రోహిత్ ఆట నుంచి విరామం తీసుకుని ఆరు నెలలు అవుతోంది. డిసెంబర్- జనవరిలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ మొదలు అన్ని సిరీస్‌‌‌‌‌‌‌‌ల్లోనూ అతను పోటీపడ్డాడు. రాబోయే నెలల్లో ఇండియా పది టెస్టులు ఆడనున్న నేపథ్యంలో రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, బుమ్రా లంకతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ లంక పర్యటనకు దూరంగా ఉండడంతో టీమిండియా కెప్టెన్సీ రేసులో ఇద్దరు ఉన్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యలో ఒకరికి కెప్టెన్సీ దక్కనుంది. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య ఉన్నాడు. దీంతో పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు వన్డేల్లో రాహుల్ అత్యంత నిలకడను చూపిస్తున్నాడు. వికెట్ కీపర్ కూడా కావడంతో రాహుల్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన పాండ్య ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ఆడలేదు. అదే సమయంలో రాహుల్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాపై భారత్ వన్డే సిరీస్ గెలుచుకుంది. మరి ఈ ఇద్దరిలో బీసీసీఐ ఎవరికీ పగ్గాలు అప్పగిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button