క్రికెట్
Dushmantha Chameera: భారత్ తో శ్రీలంక టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక నుంచి కీలక ప్లేయర్ ఔట్
టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సీనియర్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా మొత్తం పర్యటనకు దూరమయ్యాడు. శ్రీలంక క్రికెట్ చమీర స్థానంలో ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. అసిత ఫెర్నాండో, ప్రమోద్ మధుషన్‌లో ఒకరు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఈ పేసర్ తన కెరీర్ లో తరచూ గాయాలకు గురవ్వడం ఆందోళన కలిగిస్తుంది. 2015 లో అరంగేట్రం చేసిన చమీర 12 టెస్టులు, 52 వన్డేలు, 55 టీ20ల్లో 143 వికెట్లు పడగొట్టాడు.
Read also: Srilanka: భారత్ తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ టీ20 సిరీస్ కు 16 మందితో కూడిన స్క్వాడ్ ను మంగళవారం ప్రకటించింది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.