క్రికెట్
Gambhir: న్యూజిలాండ్‌తో ఓటమి.. టీమిండియా సీనియర్ ప్లేయర్లకు షాకిచ్చిన గంభీర్!
దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమిని కోచ్ గౌతమ్ గంభీర్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో గంభీర్ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సీనియర్లకు ఇస్తోన్న ‘ఆప్షనల్ ట్రైనింగ్’ సెషన్ అవకాశాన్ని రద్దు చేసినట్లు సమాచారం.
ట్రైనింగ్ సెషన్లకు రావాల్సిందే!
ఏదైనా సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆటగాళ్లకు ట్రైనింగ్ సెషన్లు నిర్వహిస్తుండటం సహజం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లకు ఇది ఆప్షనల్‌గా ఉండేది. ఆ సమయంలో వీరు గాయపడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోపాటు వ్యక్తిగత పనుల నిమిత్తం వారికి విశ్రాంతి ఇచ్చేవాళ్లు. ఇప్పుడీ ఓటమితో ఇక నుంచి ప్రతి ఆటగాడు ఆ సెషన్‌కు హాజరు కావాల్సిందేనని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.