తెలుగు
te తెలుగు en English
Linkin Bioక్రికెట్
Trending

ICC: ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ.. ఎవరెవరికి చోటంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం ఎనిమిది దేశాలు తలపడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించి 15 మందితో కూడిన టీమ్‌ను వెల్లడించారు. జస్ప్రీత్ బుమ్రా గాయం నయం కావడంతో అతడికి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కల్పించారు. మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశ‌ప‌రిచాడు. సంజూ శాంసన్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. కరుణ్ నాయర్‌ జట్టులోకి వ‌స్తాడ‌ని భావించినా చోటు దక్కలేదు. అతనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని అజిత్ అగార్కర్ చెప్పారు.

టీమిండియా జట్టు ఇదే..!

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button