తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs AUS: ఆసీస్ గడ్డపై భారత్‌కు అదిరిపోయే విజయం!

బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీని సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత్‌ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌పై టీమ్‌ఇండియా 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 3, సిరాజ్ 3, వాషింగ్టన్ సుందర్ 2.. నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్‌ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఆసీస్‌ గడ్డపై భారత్‌కిదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

ఒక రోజు మిగిలి ఉండగానే..!

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కేవలం 150 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దాంతో గెలుపు అసాధ్యమే అనుకున్నారంతా. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఆస్ట్రేలియా కూడా 104 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (161 పరుగులు), విరాట్‌ కోహ్లీ (100 పరుగులు), కేఎల్‌ రాహుల్ (77 పరుగులు) అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో 487 పరుగుల భారీ స్కోర్‌ సాధించి మరో మూడు వికెట్లు ఉండగానే డిక్లేర్‌ చేసింది. అనంతరం 534 పరుగుల భారీ లక్ష్య చేధన కోసం బరిలో దిగిన ఆస్ట్రేలియా కేవలం 238 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. 295 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button